ప్రకృతి: - ప్రేమించండి సమ్రక్షించండి ఆనందించండి. ఇలాంటి అందాలను నేను వీడియో తీస్తానని నేను ఎప్పుడు ఉహించలేదు.
ప్రకృతి: - ప్రేమించండి సమ్రక్షించండి ఆనందించండి, చివరకు, ప్రకృతిలో భాగం అవ్వండి, వీలైతే, భవిష్యత్ తరాల కోసం కెమెరాలో బందించండి
నేను హైదరాబాద్ (అల్వాల్) లో నివసిస్తున్నాను, ఇక్కడ చాలా పచ్చదనం ఉంటుంది , అపార్టుమెంటుల సంస్కృతిని చూడటం చాలా అరుదు. ప్రతి రోజు నేను వేర్వేరు పక్షుల శబ్దాలను ఆస్వాదించాను. వేర్వేరు పక్షులు మా డాబా పైన ఉన్న తోటలోకి వస్తాయి అవి మా కుటుంబ సభ్యుల మాదిరిగా అనిపిస్తుంది
మా డాబా నుండి నా వీడియో కెమెరాతో పక్షుల వీడియోలను తీయడానికి కొంత సమయం గడిపారు. ఇలాంటి అందాలను నేను వీడియో తీస్తానని నేను ఎప్పుడు ఉహించలేదు.
ప్రతిరోజూ, నేను ఇంటినుండి కార్యాలయానికి రాకపోకలలో మూడు గంటలు గడుపుతాను. నాకు కృతిని కోల్పోవడము ఇష్టము లేదు కాబట్టి ఎవ్వరు ఎన్నిసార్లు చెప్పిన ఆఫీస్ సమీపానికి మార్చలేదు
Comments
Post a Comment