పొదుపు మరియు పిల్లలకు ఆస్తి

నా చిన్నతనం  నుండి నాకు వేర్వేరు వస్తువులను కొనుగోలు చేసే అలవాటు ఉంది, సహేతుకమైన సమయంలోపల  ఉపయోగపడకపోతే, ఎవరికైనా ఇచ్చేస్తాను 


నేను కొన్న వస్తువులన్నీ  ఈ లాక్‌డౌన్ కాలంలో వాడుకలోకి వచ్చాయి.

ఆర్థిక వ్యవస్థను నడపడానికి డబ్బు ఖర్చు చేయాలని నేను ఎప్పుడూ సూచిస్తున్నాను.


కష్టంగా  పొదుపు  (Hard Savings ) చేయవద్దు

నాణ్యత విషయంలో రాజీ పడకుండా ప్రయత్నించండి

సౌకర్యం విషయంలో ఎప్పుడూ రాజీపడకండి

 

కష్టంగా  పొదుపు  (Hard Savings ) అంటే ఏమిటి =  కక్కుర్తి


మనము  కార్యాలయంలో/ఆఫీసులో  పెద్ద, కంప్యూటర్ మానిటర్‌ను ఉపయోగిస్తాము, కాని ఇంటి నుండి పనిచేసేటప్పుడు?

కొంతమంది అవసరము ఉన్నా ఉపకరణాలను వాడకుండా   కరెంట్ ని  ఆదా చేయడానికి  ప్రయత్నిస్తారు.

ప్రతిదాన్నీ లెక్కించడం, అట్లా అని దుబారా చేయకూడదు  

ఆవసరమైనదాన్ని ఇప్పుడు అవసరమా అని ఆలోచించి దాటవేయడం 


 

కష్టంగా  పొదుపు  (Hard Savings ) దాన్ని కక్కుర్తి అని అంటారు 

పొదుపు కక్కుర్తి మధ్య చిన్న గీత ఉంటుంది దాన్ని గుర్తించి మెలగాలి 

పొదుపు చాలా  అవసరము 



కష్టంగా  పొదుపు  (హార్డ్ సేవింగ్స్),  మొత్తాన్ని లెక్కించండి, మీరే అంచనా వేయండి, చివరకు, ఆదా చేసిన డబ్బు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో ఆలోచించండి అప్పటివరకు అది వాళ్లకు ఎంతవరకు అవసరమో బీరేజు వేసుకోండి.


నేను చెప్పేది ఒక్కటే వెనక్కి తిరిగి చూస్తే కష్టము మాత్రమే  కనిపించొద్దు.


 


పిల్లలకు ఆస్తి ఇవ్వడం:- 

సమర్థులకు  అవసరం లేదు.

అసమర్థులకు   అవసరం లేదు.

సగటు పిల్లలకు కొంచెం సహాయము చేస్తే తప్పు లేదు, ఆ కొంచెం కొరకు కష్టంగా పొదుపు చేయాల్సిన అవసరము లేదు 



పిల్లలు,  లగ్జరీలను,  ఆస్తులను ఆశించరు
తల్లిదండ్రుల నాణ్యమైన సమయాన్ని మాత్రమే ఆశిస్తారు మరియు అవసరము వచ్చినప్పుడు  తల్లితండ్రుల నుండి  భరోసా   మాత్రమే   ఆశిస్తారు ,














Comments